నాతవరం: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

74చూసినవారు
నాతవరం: భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
నాతవరం మండలం గన్నవరంలో తహశీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి భూసమస్యలపై అర్జీలను స్వీకరించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ రైతుల భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సు లను నిర్వహిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సింగంపల్లి సన్యాసిదేముడు, స్థానిక సర్పంచ్ బిడ్డు సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్