న్యాయం చేయాలని స్టాఫ్ నర్సులు స్పీకర్‌కు విజ్ఞప్తి
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వినతిపత్రం అందజేశారు. గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.