నాతవరంలో గురువారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీగౌరీపరమేశ్వరుల మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా భక్తులు సారె ఊరేగింపును నిర్వహించారు. అలాగే డప్పు వాయిద్యాలు, చిన్నారులు వివిధ వేషధారణ నడుమ గౌరీపరమేశ్వరులను ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అనంతరం గౌరీపరమేశ్వరులకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.