పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన సోమవారం రాత్రి విశాఖలోని పలు చోట్ల నిరసన తెలిపారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ఎంవిపి కాలనీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ డిమాండ్ చేశారు.