పాయకరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ అనకాపల్లి జిల్లా కమిటీ సభ్యుడు కె.మణికంఠ తెలిపారు. ఎలమంచిలిలో ఈనెల 13, 14 తేదీల్లో నిర్వహించే ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల వాల్ పోస్టర్ ను బుధవారం పాయకరావుపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్టీ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందన్నారు.