ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎస్. రాయవరం తహసిల్దార్ జె. రమేశ్ బాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎస్. రాయవరం మండలం పెనుగొల్లులో రెవెన్యూ సదస్సు నిర్వహించి గ్రామస్థుల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సంబంధమైన వివాదాలు, భూ ఆక్రమణలపై విచారణ నిర్వహిస్తామన్నారు.