క్రీడల పట్ల దృష్టి పెడితే చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చు

1554చూసినవారు
క్రీడల పట్ల దృష్టి పెడితే చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చు
చింతూరు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని గంగవాడ, శాంతినగర్ గ్రామాల్లో డొంకరాయి ఎస్సై శివకుమార్ గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి పెడితే చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. గంజాయి సాగు చేయటం, అమ్మడం, కొనడం, రవాణా చేయడం నేరమని తెలిపారు. చెడు మార్గాల్లో సంపాదించిన సంపద కూడా నిలవదని, కష్టపడి సంపాదించిన సంపద మాత్రమే మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్