మరో 24 గంటల పాటు వర్షాలు

55చూసినవారు
మరో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్