మంచి సమాజాన్ని నిర్మించడంలో కీలకపాత్ర ఉపాధ్యాయులదేనని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. గురువారం అనకాపల్లి శంకరన్ భవన్ లో జిల్లాస్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందన్నారు.