భీమిలి తీర ప్రాంతాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలి
భీమిలి తీర ప్రాంతాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు భీమిలి నియోజకవర్గం పరిధిలో ఎగువపేట, బోయవీధి, తోట వీధి రుషికొండ తిమ్మాపురం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు గురువారం ధర్నా నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు నూకరాజు, విజయ చందర్, అప్పారావు మాట్లాడుతూ తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు రక్షణ కల్పించాలన్నారు.