బుచ్చయ్యపేట: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని బుచ్చయ్యపేట ఎస్సై ఏ. శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండలంలోని వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల యువత గంజాయి మత్తుకుబానిసలు అవుతున్నారు అని అన్నారు. మాదకద్రవ్యాలతో, అనారోగ్యం పాలైయి, జీవితo అంధకారం అవుతుందన్నారు.