మాల్స్ దెబ్బకు సూపర్ మార్కెట్లు డీలా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిశ్రమలు అన్ని నిలదొక్కుకొనేలా చర్యలు తీసుకోవాలని సూపర్ మార్కెట్ యజమానులు పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖలోని ఎంవిపీ కాలనీలోని శివాజీ పార్కులో ఆదివారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మాల్స్ దెబ్బకు సూపర్ మార్కెట్లు కుదేలవుతున్నాయని, వీటిపై ఆధారపడిన వేలాది మంది చిరువ్యాపారులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.