జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

77చూసినవారు
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి శ్రీధర్ ను బుధవారం విశాఖలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెట్టా ప్రభాకర్, కార్యదర్శి ఆనిమిరెడ్డి శివకృష్ణ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటు చేయాలన్నారు. నర్సీపట్నంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నియామకం చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్