పోలీసు కమిషనర్‌కు 59 ఫిర్యాదులు
విశాఖ పోలీసు కమిషనరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఈ సందర్భంగా వినతులు స్వీకరించారు. మొత్తం 59 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను తెలియజేశారు. సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు.