బలపడిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు విశాఖ వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఒడిశాకు 180 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయం నాటికి ఒడిశా, పశ్చిమబంగ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.