అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో గుంతకల్లు - చిక్ జాజురు (07588/85) ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 8 నుంచి అక్టోబర్ 6 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిక్ జాజూరు- రాయదుర్గం మార్గంలో జరుగుతున్న పనుల దృష్ట్యా రద్దు చేస్తున్నామన్నారు.