కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ వీరన్న, తన తమ్ముడు చిక్కీరప్పతో కలసి బుధవారం పావగడ వైపు వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో కెంచమ్మనహళ్లి గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గమనించిన వారు ప్రథమ చికిత్స నిమిత్తం పావగడ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలించారు. అక్కడ వీరన్న చికిత్స పొందుతూ మృతి చెందారు.