బుక్కరాయసముద్రం సీఐగా కరుణాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న శ్రీధర్ సత్యసాయి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ధర్మవరం మండలంలో సీఐగా పని చేస్తున్న కరుణాకర్ బీకేఎస్ సీఐగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతలు పరిరక్షణలో ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పని చేస్తామన్నారు.