అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాని అడ్డుకోండి
బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామ సమీపంలోని వంకల్లో నుంచి గురువారం ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకొని ఇసుకను అక్రమ రవాణా చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిరోజు బుక్కరాయసముద్రం మీద నుంచి అనంతపురంకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా అవుతుందని ఆరోపించారు.