ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ మంగళవారం ధర్మవరం పట్టణంలో పర్యటించారు. 40 వ వార్డు తారకరామాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన పరిటాల శ్రీరామ్ అనంతరం కార్యకర్తలతో మహిళలతో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ చార్జ్ అశోక్, పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.