ధర్మవరంలోని పీట బసవన్న కట్ట వీధిలో గల శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని సూర్య కిరణాలు కొన్ని నిమిషాల పాటు తాకాయి. ఈ సందర్భంగా అర్చకులు రాఘవ శర్మ లింగేశ్వరుడికి వివిధ రకాల పూలతో అలంకరించి, విభూది అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.