కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామానికి చెందిన వంద ఏళ్ల వృద్ధురాలు దాసరి లక్ష్మమ్మ సోమవారం మృతి చెందారు. ఆమెకు నాలుగు తరాల సంతానం ఉంది. ఆరుగురు కుమారులు, కుమార్తెలతో పాటు మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు ఉన్నారు. గ్రామమంతా లక్ష్మమ్మ కుటుంబంలా కనిపిస్తుంది. వృద్ధురాలు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.