పెనుగొండ పట్టణంలోని కోనాపురంకు వెళ్లే రహదారి జలమయంగా మారి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని సోమవారం వాహనదారులు తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై వర్షపు నీరు నిల్వ వుండి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.