శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ వి. రత్న నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 35 అర్జీలను స్వీకరించారు. అనంతరం అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ-ఆస్థి వివాదాలు, తదితరులు విషయాలపై అర్జీలు స్వీకరించారు.