ఉరవకొండ పట్టణంలో పీడీ ఎస్ యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పరీక్షలు విద్యా జీవితంలో కీలక మైలురాయి అని, ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లెల ప్రసాద్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.