తాడిపత్రి: సారాను పూర్తిగా కట్టడి చేద్దాం
నాటుసారాను తయారు వారిపై చేసే ప్రత్యేక నిఘా ఉంచి, వాటిని పూర్తిగా అరికట్టాలని ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన తాడిపత్రి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. నాటుసారా తయారు చేసే ప్రాంతాలను గుర్తించి నాశనం చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని పలు కల్లు దుకాణాలను పరిశీలించారు. అక్కడి కల్లు నమూనాలు సేకరించారు.