తాడిపత్రి: నాటుసారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
తాడిపత్రి మండలంలోని చుక్కలూరు క్రాస్ సమీపంలో నాటుసారా అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ గడ్డం నాయుడు తెలిపారు. గుంతకల్లు మండలం గుండాల గ్రామానికి చెందిన శ్రీరాములు చుక్కలూరు క్రాస్ వద్ద ఉన్న నాపరాళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడని, అయితే కొద్ది రోజుల నుంచి నాటుసారా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేయగా 73 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.