తాడిపత్రి: షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమావేశం
తాడిపత్రిలోని పోలీస్టేషన్ పక్కన గల ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. పుట్లూరు రోడ్డులో ఖాళీగా ఉన్న 4. 25సెంట్లు, పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 11. 75సెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సలహాలు, సూచనలు కావాలని ప్రజలను కోరారు. నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.