పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
తాడిపత్రి మున్సిపాలిటీలో పని చేసే ప్రతి పారిశుద్ధ్య కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులకు దుస్తులు, మాస్కులు, బూట్లు తదితరసామగ్రి అందజేశారు. భూగర్భ మురుగునీటి కార్మికులకు సకల సౌక ర్యాలు కల్పిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.