కూడేరు: నీటితో కళకళలాడుతున్న అరవకూరు చెరువు

82చూసినవారు
కూడేరు: నీటితో కళకళలాడుతున్న అరవకూరు చెరువు
కూడేరు మండల పరిధిలోని అరవకూరు చెరువుకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా జలాలు చెరువుకు చేరుతున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా ఆత్మకూరు మండలం సింగపల్లి చెరువుకు నీటిని విడుదల చేయడంతో సింగంపల్లి చెరువు మరువ పారింది. వంక ద్వారా దిగువన ఉన్న అరవకూరు చెరువులోకి నీరు చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్