చేపల పెంపకంతోనే మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఫిషరీస్ డాక్టర్ శాంతి అధ్యక్షతన చేప పిల్లలను విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే అంతమేర మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.