జమ్మలమడుగు: "పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి"

76చూసినవారు
జమ్మలమడుగు: "పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి"
మైలవరం మండలం మైలవరం శ్రీ శక్తి మహిళా భవనం సమీపంలో బుధవారం సీఐటీయూ నాయకులు సమావేశం నిర్వహించారు. సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏసుదాసు, వినయ్ కుమార్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా మహిళలకు రుణాలు ఇప్పించేందుకు యానిమేటర్లను నియమించిదని తెలిపారు. రుణాలు ఇప్పించడంలో యానిమేటర్ లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారికి గౌరవ వేతనం వెంటనే చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్