ముద్దనూరు: 30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ముద్దనూరు వద్ద 30 ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జి బాలిరెడ్డి తెలిపారు. ముద్దనూరు మండలం, శెట్టివారిపల్లి ఫారెస్టు బీటు పరిధిలోని ఎర్రచందనం దుంగలను కారులో ఎక్కిస్తూ కొందరు కనిపించారు. వెంటనే టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కొందరు పారిపోగా, కడప జిల్లాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.