కడపలో నవంబర్ 10 నుంచి 15 వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కనీస, మౌలిక సదుపాయాలను కల్పించడంలో కడప నగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేయాల్సి ఉందన్నారు.