సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి పోలీసులు విచారణకు రావాలని ఆదివారం పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట పులివెందుల న్యాయవాది ఓబుల్ రెడ్డి, వైసిపి నేతలు ఉన్నారు.