చంద్రబాబు ప్రభుత్వం వీర బాదుడు ప్రభుత్వంగా తయారయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలను అనేక విధాలుగా బాదడం ప్రారంభించిందని అన్నారు. సర్దుబాటు చార్జీలు పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు తదితర పెంపులతో ప్రజలపైన భారం మోపుతోందని అన్నారు. ఇదేనా స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.