మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామ శివారులో కడప బద్వేల్ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం స్థానిక మండల ఎస్సై చిరంజీవి విస్తృత వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలు కచ్చితంగా ఉండాలని, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని దానివల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.