ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి ఇందిరా గురువారం ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను వివరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు ఉన్నారు.