అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల అధికారులు తమ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్ సూచించారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎన్నికల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర, ఆర్డిఓ హరిప్రసాద్, తహసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో కృష్ణమూర్తి, 6 మండలాల ఎన్నికల అధికారులు రెవెన్యూ సిబ్బంది, వీఆర్వో, లు, వీఆర్ఏలు పాల్గొన్నారు.