తంబళ్లపల్లె వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సతీమణి కవితమ్మ శనివారం కురబలకోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారభించారు. శనివారం ఆమె మండలంలోని తెట్టు గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డిలను మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.