అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పి. టీఎంలో వెలిగిన శ్రీ పార్వతి విరుపాక్షేశ్వరస్వామి ఆలయంలో ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో పంచామృతాభిషేకం, ఏక వార రుద్రాభిషేకం స్వామివారికి సుందరంగా అలంకరించి, సప్తహారతి, నక్షత్రహారతి, మహా మంగళహారతి నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.