తంబళ్లపల్లెకు చెందిన పోర్డు సంస్థ బాలల ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ నరసింహులకు సేవారత్న అవార్డు దక్కింది. తిరుపతి యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జానపద సాహిత్య, సాంస్కృతిక కళాసంస్థ (MARP) సంస్థ అధ్యక్షుడు గుర్రప్ప నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పాటలు, డప్పు వాయిద్యాలతో ప్రజలను చైతన్య పరుస్తూ, బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు నరసింహులును ఈ అవార్డు వరించింది.