ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఓ. నరసింహారావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.