అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన గుంటూరు నగరపాలక సంస్థ
గుంటూరులో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతకు నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గాంధీ పార్కు వద్ద నిర్మిస్తున్న ఈ బస్ బేను కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు. ఈ నిర్మాణాలు వివాదంగా మారాయి. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు సాగుతున్నాయని ఇటీవల టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీనిపై నగరపాలక సంస్థ స్పందిస్తూ నిర్మాణాలు కూల్చి వేసింది.