రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 18న పిడుగురాళ్ల గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 15 నుంచి 45 సం. లోపు వారు అర్హులని అన్నారు. రూ. 35 వేల వరకు జీతం లభిస్తుందని నైపుణ్యం. ఏపీ. గవర్నమెంట్. ఇన్ లో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చని, నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు.