తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ వైద్య సేవలో పని చేస్తున్న వైద్యమిత్రాలు సభ్యులు సోమవారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పనిచేస్తున్నామని, చాలా తక్కువ జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని, అంతర్గత ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.