నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు. ఆదివారం పెదకూరపాడులో 50 లక్షల రూపాయలతో నిర్మితమవుతున్న సిమెంట్ రోడ్లను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.