నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని శనివారం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లులో సీపీఐ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా, ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని అన్నారు.