విద్యార్థులకు మొరుగైన వసతులు కల్పించాలి: జిల్లా కలెక్టర్

60చూసినవారు
విద్యార్థులకు మొరుగైన వసతులు కల్పించాలి: జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో పక్కాగా వసతులు కల్పించాలని, వార్డెన్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ షణ్మోహన్ శనివారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు సక్రమంగా మెనూ అమలు చేయాలని, ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్