ఆదాయం లక్షల్లో.. సౌకర్యాలు సున్నా

561చూసినవారు
శాంతిపురం మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే బడుగుమాకుపల్లి వారపుసంత ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తున్నా కాని సంతలో కనీస సౌకర్యాలు సున్నాగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై నిర్వహించే సంత కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పోలీసులు ట్రాఫిక్ జామ్ ని నియంత్రిస్తుంటారు. ఇకనైనా సంభందిత అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్